Meena | సౌత్ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నీ భాషల్లోనూ సత్తా చాటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ స్టేటస్ అందుకుంది. వైవాహిక జీవితం తర్వాత కూడా సినిమాలను విడిచిపెట్టని మీనా కుటుంబాన్ని, కెరీర్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు. అయితే భర్త మరణంతో ఆమె జీవితంలో భారీ లోటు ఏర్పడింది. అప్పటి నుంచి ఆమె తన కుమార్తెతోనే సంతోషకర జీవితం గడుపుతుంది.
వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఎదురైన కూడా కెమెరా ముందుకొచ్చే సమయంలో మాత్రం చిరునవ్వుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. భర్త మరణించిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం చాలా కాలంగా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. ఎవరు విడాకులు తీసుకున్నా, ఎవరి వ్యక్తిగత జీవితం మారినా దానికి మీనానే కారణం అని వార్తలు రావడం ఆమెను అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ రూమర్లు పీక్స్‌కి చేరడంతో, మీనా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నేను నా పాపతో ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఏ హీరో విడాకులు తీసుకున్నా… అతనితో నా పెళ్లి అంటూ రాస్తున్నారు. ఇవన్నీ తప్పు. నేను ఇప్పుడు దృష్టి పెట్టింది నా కెరీర్‌పైనే.
మీనా ఇటీవల మలయాళం దృశ్యం 3 షూటింగ్లో పాల్గొంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఆన్సెట్స్లో ఉంది. అలాగే తమిళంలో మూకుత్తి అమ్మన్ 2, రౌడీ బేబి వంటి ప్రాజెక్టుల్లో కూడా ఆమె నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దృశ్యంలోనూ మీనా ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దృశ్యం 3 తెలుగు వెర్షన్లో కూడా ఆమెకు అవకాశం ఉండే అవకాశం ఉంది. తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారో కూడా మీనా వెల్లడించారు. పాప పుట్టిన రెండేళ్లకే దృశ్యం కోసం అడిగారు. అప్పుడు చేయలేకపోయా. కొన్ని రోజుల తర్వాత కథ నచ్చడంతో ఒకే అన్నా. ఇప్పటికీ కంటెంట్ బాగుంటేనే చేస్తాను. పాత్రలో సంతృప్తి లేకపోతే నో చెబుతాను అని మీనా పేర్కొంది.