కాజీపేట : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు క్షమాపణ చెప్పకుంటే లక్ష డప్పులతో దండోరా వేయించి ఎమ్మెల్యే నా ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు, 61 వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మరి కోటిలింగం హెచ్చరించారు. కాజీపేట పట్టణం 61 వ డివిజన్ పరిధిలో స్థానిక డివిజన్ కమిటీ, బీఆర్ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డాక్టర్ తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రి హరీశ్ రావపై ఇష్టరాజ్యంగా అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఎమ్మెల్యే నాయిని పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు, దళిత సంఘాల నాయకులు గాదెపాక రమేష్, కందుకూరి లక్ష్మీ నారాయణ, గడల వెంకట లక్ష్మి, బండ రాజేశ్వరి, దుప్పటి సీత,జెట్ రామా, బొర్రా కళ్యాణ్, చంద్ర మౌళి, శ్రీనివాస్, అంబాల రమేష్. దాసాని శివ శంకర్, బండారు శ్రీకాంత్, చరణ్, కృష్ణవేణి. దప్పిటి సునీత, రోవావ్, జానీ రమేష్,అశోక్ కుమార్ తదితరులు
పాల్గొన్నారు.