పెన్పహాడ్, మార్చి 07 : పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. బాల బాలికలు వివిధ పాత్రలు పోషించారు. జిల్లా కలెక్టర్గా మేకల హవీలా, జిల్లా విద్యాశాఖ అధికారిగా కత్తి అక్షిత, ఎంఈఓగా గుంజ జెస్సికా, ప్రధానోపాధ్యాయుడిగా గుగ్గిళ్ల రమ్యశ్రీ, ఉపాధ్యాయులుగా మద్దెల సృజన్, మీసాల శ్రీవిద్య, మేకల వీరన్స్, నిరీక్షణ, గుగ్గిళ్ల హర్షిత, సాద్వి, కారుణ్య తమ పాత్రలు పోషించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇ.నగేశ్, పి.వాణి పాల్గొన్నారు.