KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
KTR | నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లను పెంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమకు అభ్యంతరం లేదని ముందు నుంచే చెబుతున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
KTR : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లను పెంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమకు అభ్యంతరం లేదని ముందు నుంచే చెబుతున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం.. జనాభాగణన జరిగిన ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరిగా చేపట్టాలని కేటీఆర్ గుర్తుచేశారు. 2021లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉండెనని, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడిందని తెలిపారు. కేవలం జనాభా ఆధారంగా జరిగే పునర్విభజనకు వ్యతిరేకంగా మనమంతా తీవ్రంగా పోరాటం చేశామని అన్నారు.
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన ఆందోళనలను పరిష్కరించడానికి రంగంలోకి దిగి ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నదని, ఈ ప్రతిపాదనను బీఆరెస్ స్వాగతిస్తున్నదని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

