తిరుమల : లోక కళ్యాణం కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల( Tirumala ) లోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం (Sundarakanda Parayanam) నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఒకరోజు ముందు 27న సాయంత్రం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణతోఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వివరించారు.
పారాయణంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన, అభిషేకం, హోమం, అనుష్టానం నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 13న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుందని వెల్లడించారు.