Sundarakanda Parayanam | లోక కళ్యాణం కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల లోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, అభీష్టాలు నెరవేరడం కోసం, సంకల్పించిన కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని కోరుతూ సాంప్రదాయికంగా సుందరకాండ, శ్రీ గురు దత్తాత్రేయ, శ్రీ సాయి సచ్చరిత్రలను పారాయణం చేస్తుంటారు.