MLA Koninty Manik Rao | కోహీర్, జూలై 13 : రక్తదానం ప్రజల ప్రాణాలను కాపాడుతుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. ఆదివారం కోహీర్ పట్టణంలోని ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు మాట్లాడుతూ.. అన్నదానం కంటే రక్తదానం చాలా గొప్పదన్నారు. అన్నదానం ఒక పూట ఆకలిని తీరుస్తుందన్నారు. కానీ రక్తదానం రోగుల జీవితాన్ని కాపాడుతుందని వివరించారు.
తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమలో ఉండే భయాన్ని విడిచిపెట్టాలని సూచించారు.
ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, పాఠశాల హెచ్ఎం మునావర్అలీ అందిస్తున్న ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఎంపీపీ శౌకత్‌అలీ, నామరవికిరణ్, ప్రసాద్‌రెడ్డి, కలీం, జావీద్, హన్నాన్ జావీద్, అగర్వాల్, వంశీ, జలీల్, సుమంజయన్, రత్నావళి, ముస్తఫా, కరీం, మజీద్అలీ, దశరథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం