హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్థిత్వానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 24న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. వేడుకలపై సోమవారం మాజీ మంత్రులు తలసాని, పద్మారావుగౌడ్, నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమీక్షించారు.
ఈ వేడుకలో పార్టీ మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. నగరం నుంచి పెద్దసంఖ్యలో మహిళలు తరలివచ్చేలా మహిళా కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కృషి చేయాలని సూచించారు.