హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్న టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్‌తో కూడిన ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
2010కి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉండగా, ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో మినహాయింపు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.