హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : లా కోర్సుల్లో మరో 3,644 సీట్లు భర్తీ అయినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం వెల్లడించారు. మూడేండ్ల కోర్సులో 2,593, ఐదేండ్ల కోర్సులో 1,051 సీట్ల చొప్పున భర్తీ అయినట్టు తెలిపారు.
సీట్లు పొందినవారు ఈ నెల 27లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని సూచించారు.