హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కేంద్ర రక్షణశాఖ ప్రైవేట్ రంగంలో సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసింది. విజయవాడ సమీపంలో ఈ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిచ్చినట్టు పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్‌రెడ్డి సోమవారం తెలిపారు.
ఈ స్కూల్లో తెలంగాణ విద్యార్థులకు సీట్లు పొందే అవకాశామిచ్చిందని, 120 సీట్లుంటాయని, అఖిల భారత సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు.