‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’ చిత్రం 900కోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. సందీప్‌రెడ్డి మేకింగ్ ైస్టెల్, ఎమోషన్స్..యాక్షన్ ఘట్టాలను వినూత్న శైలిలో ప్రభావవంతంగా తెరపై ఆవిష్కరించే విధానం ప్రశంసలందుకొంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు.
ఇదిలా వుండగా స్వీయ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్‌రెడ్డి వంగా నిర్మాతగా ఓ చిన్న చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దీనికి రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు వేణు దర్శకత్వం వహిస్తారని, ‘మేము ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తారని సమాచారం. తెలంగాణ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిదని, కథ, కథనాలు సరికొత్త పంథాలో సాగుతాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలిసింది. ఇక ‘స్పిరిట్’ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది.