Asha workers | తొగుట, ఆగస్టు 19 : ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి బీ ప్రవీణ డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పీహెచ్సీ ముందు ధర్నా చేశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ రాధాకిషన్కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలతోపాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని, ప్రమోషన్స్ కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు పోస్టుల్లో డైరెక్ట్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్సీ, పీఎన్సీ తదితర టార్గెట్లను వెంటనే రద్దు చేయాలని.. గత 3 సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు పారితోషికం లేని పనులు చేయించకూడదని తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు డీ లక్ష్మి, క్రిష్ణవేణి, సౌందర్య, రూప, జ్యోతి, స్వరూప, నవీన, కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి