మౌంట్‌మాంగనూయ్: వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు రికార్డునే ఆ టీమ్ తిరగరాయడం విశేషం. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా క్రికెట్లో ఈ కొత్త వరల్డ్ రికార్డు నమోదైంది. వన్డేల్లో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల టీమ్ సృష్టించిన వరుస విజయాల రికార్డును మహిళల టీమ్ ఈ విజయం ద్వారా తిరగరాసింది. ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్‌కు ఇది వరుసగా 22వ విజయం కావడం విశేషం. ఇప్పటి వరకూ 21 వరుస విజయాలతో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఈ రికార్డు ఉంది.
చివరిసారి 2017 అక్టోబర్‌లో ఓ వన్డే మ్యాచ్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పటి వరకూ మళ్లీ ఓటమి రుచి చూడలేదు. 2018 మార్చిలో ఇండియాపై 3-0 విజయంతో ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్ జైత్రయాత్ర మొదలైంది. ఆ తర్వాత వాళ్లు పాకిస్థాన్ (3-0), న్యూజిలాండ్ (3-0), ఇంగ్లండ్ (3-0), వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0), న్యూజిలాండ్ (3-0)లపై సిరీస్ విజయాలు సాధించారు. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
They've done it!
— cricket.com.au (@cricketcomau) April 4, 2021
A record-breaking 22 straight ODI wins for the all-conquering @AusWomenCricket team as they defeat NZ by six wickets at Bay Oval.
Legends. #NZvAUS pic.twitter.com/Xc5ogMDPUi
Australia's world record ODI winning streak from March 12, 2018 to today:
— cricket.com.au (@cricketcomau) April 4, 2021
vs India 3-0
vs Pakistan 3-0
vs New Zealand 3-0
vs England 3-0
vs West Indies 3-0
vs Sri Lanka 3-0
vs New Zealand 3-0
vs New Zealand 1-0@AusWomenCricket | #NZvAUS pic.twitter.com/rcF3ta7Eyl
ఇవికూడా చదవండి..
మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా