Madras High Court | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (bomb threat) ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాలలకు, కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, విమానాశ్రయాలకు, హైకోర్టులకు ఇలా వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.
మద్రాస్ హైకోర్టు అధికారిక ఈమెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనాస్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని లాయర్లను బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇవాళ ఉదయం బాంబే హైకోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. కోర్టును బాంబులతో పేల్చేస్తామని ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనంగా పోలీస్ బలగాలను రప్పించి ముందుజాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వారం వ్యవధిలో బాంబే హైకోర్టుకు బెదిరింపులు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
#WATCH | Tamil Nadu | An anonymous bomb threat email was sent to the Madras High Court on the court’s official email ID. Police personnel and a bomb squad immediately rushed to the spot and began a thorough inspection of the premises and surrounding areas. According to High Court… pic.twitter.com/01KrhN5OQf
— ANI (@ANI) September 19, 2025
Also Read..