చిన్నగూడూరు : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు( Chinnagudur ) మండల కేంద్రంలోని ఆయా ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ( Bathukamma celebrations ) నిర్వహించారు. చిన్నారులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
తెలంగాణ జిల్లాల్లోని ప్రతి పట్టణం, పల్లెల్లోజరగనున్న తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల వేడుకల నిర్వహణపై స్థానికులు విద్యార్థులను అభినందించారు . ఈ సందర్భంగా విద్యార్థుల ఆట,పాటలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.