Banu Mushtaq | మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి భాను ముస్తాక్.. ఆ పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
Banu Mushtaq | కర్ణాటక (Karnataka) లోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత (Buker prize winner) భాను ముస్తాక్ (Banu Mushtaq) కు ఆహ్వానం పంపింది.
Banu Mushtaq : కర్ణాటక (Karnataka) లోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత (Buker prize winner) భాను ముస్తాక్ (Banu Mushtaq) కు ఆహ్వానం పంపింది. ఈ నెల 22న మైసూరు (Mysuru) లో జరిగే దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని ఈ నెల 3న ఆయనకు ఆహ్వానం పంపింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
భాను ముస్తాక్‌కు ఆహ్వానాన్ని సవాల్ చేస్తూ హెచ్ఎస్ గౌరవ్ అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. భాను ముస్తాక్ హిందూ మతానికి వ్యతిరేకంగా, కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె చేతుల మీదుగా దసరా ఉత్సవాలను ప్రారంభించడం హిందూ సంప్రదాయనికి విరుద్ధమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి భాను ముస్తాక్‌కు ఆహ్వానాన్ని రద్దు చేసుకునేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
అయితే ఆ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో గౌరవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. భాను ముస్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం ప్రజల చట్టపరమైన హక్కులకుగానీ, రాజ్యాంగపరమైన హక్కులకుగానీ భంగం కలిగించదుగా అని వ్యాఖ్యానించింది. భాను ముస్తాక్ బుకర్ ప్రైజ్ గెలిచినందుకు గౌరవంగా దసరా ఉత్సవాల ప్రారంభానికి ఆహ్వానించామని, అందులో తప్పేముందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

