Rahul Gandhi | ఓట్ల చోరీ (vote chori)పై నిర్వహించిన ప్రెస్ మీట్‌తో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. దేశంలో ఓట్ల చోరీపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. కర్ణాటకలోని ఆలంద్, మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రెస్ మీట్లో ఓట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్ నంబర్ (Phone Number)ను రాహుల్ ప్రదర్శించారు. అది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు చెందిన అంజనీ మిశ్రా (Anjani Mishra) అనే వ్యక్తి ఫోన్ నంబర్. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అంజనీ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత దేశం నలుమూలల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఆ ఫోన్ నంబర్‌ను తాను 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఓటరు తొలగింపుకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదని వివరించారు. ప్రెస్ బ్రీఫింగ్ (press briefing)లో రాహుల్ తన నంబర్‌ను ప్రస్తావించడం చూసి షాక్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంజనీ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Durga Idols Face Stolen | దుర్గామాత ముఖాలు చోరీ.. వ్యక్తిని స్తంభానికి కట్టేసి
PM Modi | బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టు.. తన నివాసంలో నాటిన ప్రధాని మోదీ
Solar Eclipse: అమావాస్య వేళ.. పాక్షిక సూర్య గ్రహణం.. ఇండియాలో ఆ గ్రహణం కనిపిస్తుందా?