Durga Idols Face Stolen | దసరా వచ్చిందంటే చాలు పశ్చిమ బెంగాల్ (West Bengal)లో సందడి వాతావరణం నెలకొంటుంది. దుర్గామాత విగ్రహాల (Durga Idols)తో మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, పండుగ వేళ అక్కడ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దుకాణంలో అమ్మకానికి ఉంచిన దుర్గామాత విగ్రహాల ముఖాలు చోరీకి గురయ్యాయి (Durga Idols Face Stolen).
అసన్సోల్లోని శిల్పి బాపి పాల్ (sculptor Bapi Pal) వర్క్‌షాప్‌లో ఉంచిన రెండు దుర్గామాత విగ్రహాల ముఖాలు చోరీకి గురయ్యాయి. దీంతో దుకాణం యజమాని వాటికోసం తీవ్రంగా వెతికారు. సమీపంలోని ప్రీతమ్ ఠాకూర్ వర్క్‌షాప్‌లో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి ముఖాలను దొంగిలించిన సదరు వ్యక్తిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ‘ఈ దొంగతనం అసూయ, దురుద్దేశంతోనే జరిగింది. ఈ విగ్రహాల్లో ఒకదాన్ని పూజా కమిటీకి అందించాల్సి ఉంది’ అని దుకాణం యజమాని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
PM Modi | బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టు.. తన నివాసంలో నాటిన ప్రధాని మోదీ
Actor Vijay | టీవీకే విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం
Bomb threat | బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్..!