Bomb threat | బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్..!
Bomb threat | బాంబే హైకోర్టు (Bombay High Court) కు మళ్లీ బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చింది. కోర్టును బాంబులతో పేల్చేస్తామని ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
Bomb threat : బాంబే హైకోర్టు (Bombay High Court) కు మళ్లీ బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చింది. కోర్టును బాంబులతో పేల్చేస్తామని ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనంగా పోలీస్ బలగాలను రప్పించి ముందుజాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
కోర్టు లోపలికి వచ్చే వాహనాలను, కోర్టు బయటికి వెళ్లే వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తనీఖీల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ మెయిల్‌తో కోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగలేదు.
కాగా బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఈ వారం రోజుల్లో ఇది రెండోసారి. గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 12న కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో లాయర్లను, సిబ్బందిని హుటాహుటిన బయటికి పంపించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు దొరకలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

