Actor Vijay | తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కజగం (Tamilaga Vetri Kazhagam) చీఫ్ విజయ్ (Actor Vijay) ఇంట్లో భారీ భద్రతా వైఫల్యం (security breach) బయటపడింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు అరుణ్ (24)గా గుర్తించారు. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కి భద్రతను పెంచాలని కోరుతున్నారు.
మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ (Actor Vijay) భద్రత విషయంలో కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు వై+ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ ఆదేశాలతో విజయ్‌కి 24 గంటల పాటూ సాయుధ గార్డులు రక్షణ కల్పిస్తున్నారు. వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు, మిగిలినవారు పోలీసు సిబ్బంది ఉంటారు. విజయ్ కాన్వాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి.
కాగా, స్టార్ నటుడు అయిన విజయ్ దళపతి (Actor Vijay) గతేడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) పేరుతో పార్టీని ప్రకటించారు. ఇక 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు.
Also Read..
Delivery Agent | ఆర్డర్ ఆలస్యంగా వచ్చినందుకు.. డెలివరీ ఏజెంట్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు
Khammam Rural | వారం రోజుల తర్వాత కేంద్రాలకు యూరియా.. తెల్లవారుజాము నుంచే క్యూ కట్టిన రైతులు
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌తో కొత్త తరహా యుద్ధం చేశాం: సీడీఎస్ అనిల్ చౌహాన్