Delivery Agent | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమ ఆర్డర్ ఆలస్యంగా (Delayed Order) వచ్చిందన్న కారణంతో జొమాటో (Zomato) డెలివరీ ఏజెంట్ (Delivery Agent)పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. శోభా థియేటర్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు వ్యక్తులు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. అయితే, ఆర్డర్ డెలివరీ చేయడం కాస్త ఆలస్యం కావడంతో కస్టమర్లు డెలివరీ బాయ్‌తో గొడవపడ్డారు. అది కాసేపటికే వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు వ్యక్తులు డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. తమ చేతుల్లో ఉన్న వస్తువులతో తీవ్రంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌తో కొత్త తరహా యుద్ధం చేశాం: సీడీఎస్ అనిల్ చౌహాన్
Donald Trump : ఇండియా, మోదీ నాకు మంచి సన్నిహితులే: డోనాల్డ్ ట్రంప్
Drones: సైనికులకు డ్రోన్ శిక్షణ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ