న్యూఢిల్లీ: డ్రోన్ల(Drones) వినియోగంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈగిల్ ఇన్ ద ఆర్మ్ పేరుతో డ్రోన్ టెక్నాలజీపై సైన్యం కసరత్తులు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో ఉన్న లికాబలి డ్రోన్ ల్యాబ్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది విజిట్ చేశారు. ప్రతి సైనికుడు ఆయుధాన్ని వాడడం ఎలా నేర్చుకున్నారో, అలాగే డ్రోన్ల వినియోగంపై అవగాహన ఉండన్నారు.
సైనికులు ఎలా తమ రైఫిళ్ల అంశంలో శిక్షణ పొందుతారో ఆ రీతిలోనే ప్రతి సైనికుడు డ్రోన్ల ఆపరేషన్ గురించి తెలుసుకోవాలన్నాడు .యుద్ధాలు, నిగా,లాజిస్టిక్స్, మెడికల్ ప్రయోజనాల కోసం డ్రోన్లను వాడనున్నట్లు చెప్పారు. డ్రోన్ల టెక్నాలజీ అంశంలో సైనికులకు శిక్షణ ఇచ్చే నేపథ్యంలో పలు ట్రైనింగ్ సెంటర్లను ఓపెన్ చేశారు.
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, మహువాలోని ఇన్ఫాంట్రీ స్కూల్, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆర్మీకి చెందిన అన్ని విభాగాల్లో సైనికుల్ని డ్రోన్ సుశిక్షితులను చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అని ఆర్మీ ఛీప్ పేర్కొన్నారు.