PM Modi | ప్రధాని మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-౩ (King Charles 3) ఓ విశిష్ట బహుమతి (Birthday Gift)ని అందించిన విషయం తెలిసిందే. బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టును (Kadamb Tree) పంపించారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ ఆ చెట్టును ప్రధాని మోదీకి అందజేసింది. అయితే ఆ గిఫ్ట్‌ను ప్రధాని తన అధికారిక నివాసంలో నాటారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో శుక్రవారం ఉదయం నాటారు. అనంతరం ఆ మొక్కకు నీళ్లు పోశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈనెల 17న ప్రధాని మోదీ తన 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వివిధ దేశాధినేతలు, ప్రముఖులు ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని కోసం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కదంబ చెట్టును పంపించారు. ‘అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ బహుమతి పంపించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi today planted a Kadamb sapling at his residence, 7 Lok Kalyan Marg. The sapling was a special gift from King Charles III of the United Kingdom, symbolising friendship and shared commitment to environmental sustainability. pic.twitter.com/m3uw0ckbee
— ANI (@ANI) September 19, 2025
Also Read..
Actor Vijay | టీవీకే విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం
Bomb threat | బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్..!
Dharmasthala: ధర్మస్థలిలో ఏడు పుర్రెలను వెలికి తీసిన సిట్