అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్‌ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన్‌లో జరిగిన ఈ రేస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిడ్నీ.. బంగారు పతకం కూడా సాధించింది.
గత నెల హేవర్డ్ ఫీల్డ్‌లో కూడా ఆమె అద్భుతంగా రాణించింది. అక్కడ కూడా ఇదే రేస్‌ను 51.41 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఈ రికార్డు కూడా బద్దలుకొట్టింది. ఈ క్రమంలో సిడ్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.