ముంబై : ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయ్యింది. ఈ క్రమంలో నోస్ వీల్ ఊడిపోయింది. దీంతో పైలట్ ముంబై విమానాశ్రయాన్ని సంప్రదించగా.. అధికారులు ల్యాండ్‌కు ఏర్పాట్లు చేశారు. ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగకుండా ఫోమ్‌ను చల్లించగా.. పైలట్ బెల్లి ల్యాండింగ్ చేయడంతో అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ముంబై విమానాశ్రయ సిబ్బందిని పౌర విమానయాన మంత్రిత్వశాఖ అభినందించింది. ముంబై విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షెడ్యూల్ చేయని విమానం వీటీ-జీఐఎల్ ఓ రోగి, ఇద్దరు సిబ్బంది, ఓ వైద్యుడు, పారామెడికల్ సిబ్బందితో హైదరాబాద్ బయలుదేరింది.
టెకాఫ్ అయిన వెంటనే విమానం నోస్ వీల్ ఊడిపోయింది. దీంతో విమానాన్ని ముంబైకి మళ్లించారు. దీంతో ఫైర్ అండ్ రెస్క్యూ రెస్పాండర్స్, ఫాలో మీ వెహికిల్స్, సెక్యూరిటీ, వైద్య బృందంతో పాటు వారిని తరలించేందుకు వాహనాలను అధికారులు మోహరించారు. ల్యాండింగ్ జరిగే సమయంలో మంటలు చెలరేగకుండా ముందస్తుగా నర్వే 27ను ఫోమ్‌తో నింపారు. జెట్ సర్వ్ నిర్వహిస్తున్న టర్బోప్రాప్ను కెప్టెన్ కేశ్రీ సింగ్ వీల్ లేకుండానే రన్‌వేపై బెల్లి ల్యాండింగ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకుండా సురక్షితంగా అందరూ బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేనేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయని విమానాశ్రయం తెలిపింది.
#Maharashtra: Air ambulance with a patient onboard made an emergency landing at the Mumbai airport last evening after losing a wheel during take-off from Nagpur. pic.twitter.com/6DKQffRFbW
— NDTV (@ndtv) May 7, 2021
This video captures the crucial moments after belly landing of the ambulance flight on foam carpet in Mumbai after it lost a wheel during takeoff from Nagpur.
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 6, 2021
All onboard are safe.
Kudos to the crew & ground professionals.
@DGCAIndia @CSMIA_Official pic.twitter.com/b7fgBef1x4