Farmers | రామాయంపేట, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వరి ధాన్యాన్ని వెంటవెంటనే లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి ఆదేశించారు.
తహసీల్దార్ ఇవాళ రామాయంపేట పట్టణంతోపాటు డి ధర్మారం తదితర గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు ధాన్యం మంచి మ్యాచర్ వచ్చేలా వడ్లను ఎండబెట్టాలన్నారు. వడ్లు మంచిగా ఎండితేనే మ్యాచర్ వచ్చి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు.
కేంద్రాల్లో ఉన్న సిబ్బంది ఇక్కడే ఉండి రైతులకు టార్ఫాలిన్లు, బ్యాగులను అందజేయాలని ఆదేశించారు. బ్యాగులను నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు లారీలలో తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్