ChatGPT | చాట్‌జీపీటీని నమ్మి.. ఆస్పత్రి పాలై.. కొంపముంచిన డైట్ సలహా
ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి రావడంతో చాలామంది చిన్నచిన్న సలహాల కోసం కూడా ఏఐపై ఆధారపడుతున్నారు. కానీ ఆ గుడ్డి నమ్మకం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి అమెరికాలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.
ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి రావడంతో చాలామంది చిన్నచిన్న సలహాల కోసం కూడా ఏఐపై ఆధారపడుతున్నారు. కానీ ఆ గుడ్డి నమ్మకం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి అమెరికాలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చిన ఓ డైట్ సలహా (Diet advice) ను గుడ్డిగా పాటించిన ఓ వ్యక్తి.. ప్రాణాంతకమైన బ్రోమైడ్ పాయిజనింగ్ (Bromide poisoning) బారినపడి ఆస్పత్రి పాలయ్యాడు.
ఏఐ సలహావల్ల ఈ రకమైన పాయిజనింగ్ జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన వైద్యులు ఈ వింత కేసు వివరాలను ‘అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ : క్లినికల్ కేసెస్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. వారి కథనం ప్రకారం.. ఒక వ్యక్తి తన ఆహారంలో ఉప్పుకు బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం చాట్‌జీపీటీని సలహా అడిగాడు. దానికి ఏఐ సోడియం బ్రోమైడ్ను సూచించింది.
కానీ దానివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఎలాంటి హెచ్చరిక చేయలేదు. దాంతో ఆ వ్యక్తి మూడు నెలలపాటు దాన్ని తీసుకున్నాడు. కొంతకాలానికి అతని ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. తన పొరుగింటివారు తనపై విష ప్రయోగం చేస్తున్నారని భయపడి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించగా.. అతడిలో దాహం వేస్తున్నా నీళ్లు తాగడానికి నిరాకరించడం, భ్రమలకు లోనవడం, తీవ్రమైన ఆందోళన వంటి లక్షణాలు కనిపించాయి.
అతని పరిస్థితి మరింత దిగజారి, మతిస్థిమితం కోల్పోవడంతో వైద్యులు అతడిని మానసిక చికిత్స కోసం ప్రత్యేక వార్డుకు తరలించాల్సి వచ్చింది. చికిత్సలో భాగంగా అతనికి యాంటీసైకోటిక్ మందులు, ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో క్రమంగా కోలుకున్నాడు. ఆ తర్వాత అసలు విషయం వైద్యులకు చెప్పాడు. ఉప్పుకు బదులుగా ఏఐ చెప్పిన సలహా పాటించానని, అదే ఈ పరిస్థితికి కారణమవుందనుకోలేదని వాపోయాడు.
ఆసక్తికరంగా వైద్యులు అదే ప్రశ్నను మళ్లీ చాట్‌జీపీటీని అడిగినప్పుడు.. అది మళ్లీ బ్రోమైడ్ను సూచించింది. కానీ దానివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మాత్రం హెచ్చరించలేదు. గతంలో బ్రోమైడ్ సమ్మేళనాలను ఆందోళన, నిద్రలేమి మందులలో వాడేవారు. కానీ వాటి తీవ్ర దుష్ప్రభావాల కారణంగా దశాబ్దాల క్రితమే నిషేధించారు. ప్రస్తుతం పశువుల మందులు, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులలో మాత్రమే బ్రోమైడ్ను వాడుతున్నారు.
కాగా బాధిత వ్యక్తి సుమారు మూడు వారాల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అయితే శాస్త్రీయ సమాచారం కోసం ఏఐ ఉపయోగపడినా, వైద్య సలహాలకు మాత్రం దానిని ఎప్పటికీ ప్రత్యామ్నాయంగా భావించరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More >>
జార్జియాలోని ఓ ఇంటిపై రాలిపడిన పురాతన ఉల్క.. దాని పరిమాణం ఎంతంటే..!
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రధాని మోదీ మెట్రో రైడ్
కవ్వించి.. హోటల్‌కు రప్పించి! నగ్నవీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మోసగాళ్లు..
ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
పెళ్లి పీటలెక్కబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. వరుడు మరెవరో కాదు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

