Child Artist | ఒకప్పుడు బాలనటులుగా స్క్రీన్‌పై మెరిసిన చాలా మంది చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొందరు మాత్రం సినిమాలకు దూరంగా, తమకిష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు. అటువంటి వారిలో ‘అరుంధతి’ సినిమాలో చిన్నారిగా కనిపించి మన మనసుల్లో నిలిచిన ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు ఆ చిన్నారి పెళ్లి పీటలెక్కబోతోంది. 2009లో విడుదలైన ‘అరుంధతి’ చిత్రంలో చిన్నప్పటి అరుంధతిగా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బాలనటి పేరు దివ్య నాగేశ్.
తెలుగు, తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన దివ్య.. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సింగంపులి, అపరిచితుడు వంటి చిత్రాల్లో నటించినా, కొంతకాలానికే చదువుల కోసం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. తర్వాత దివ్య పూర్తిగా డ్యాన్స్, మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ, తన టాలెంట్‌ను చూపిస్తూ మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. తాజాగా దివ్య తన జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది .పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతోంది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అయిన అజయ్ కుమార్‌తో ప్రేమలో ఉన్న దివ్య, ఈ ఏడాది జనవరిలో అతనితో నిశ్చితార్థం చేసుకుంది.
వీరిద్దరి పెళ్లి ఈ నెల ఆగస్ట్ 18న జరగనుంది. ప్రస్తుతం దివ్య వెడ్డింగ్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంది. తాజాగా, తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ జరుపుకున్న దివ్య, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెంటనే నెటిజన్లు, ఫాలోవర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్నప్పటి అరుంధతిగా ఆకట్టుకున్న ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పెళ్లికూతురు అయిందా!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్నపుడే గొప్ప నటనతో మంత్రముగ్ధులను చేసిన దివ్య నాగేశ్ ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.