Farmers | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్‌పై రైతన్నలు కన్నెర్రజేస్తున్నారు. కాళ్లుచేతులు విరగ్గొట్టుకోవడమే అసలైన మార్పు అని విమర్శించాడు ఓ రైతు. యూరియా బస్తా కోసం క్యూలైన్లో నిల్చున్న ఓ రైతు ఆవేదన అతని మాటల్లోనే విందాం..
‘మనిషికి ఒకటే బస్తా ఇస్తున్నరు. ఒక్క బస్తా యూరియా ఎకరా పొలానికి కూడా సరిపోదు. పలుచగా చల్లితేనే సరిపోతది. ఇప్పుడు వీళ్లు ఇచ్చే బస్తా కేవలం 40 కిలోలు మాత్రమే. అంటే ఎకరాకు కూడా సరిపోదు. తోసుకోవడం, కింద పడిపోవడం, కాళ్లుచేతులు విరగ్గొటుకోవడమే అసలైన మార్పు. రైతులను రాజులను చేసిండు.. నెత్తిమీద కిరీటం వచ్చింది’ అని విమర్శించాడు రైతు.
‘పొద్దుగాళ్ల ఏడున్నరకు వచ్చి లైన్లో నిలబడ్డాం. 11 గంటలకు టోకెన్ దొరికింది. యూరియా ఇచ్చే వరకు ఏ టైమ్ అయితదో తెల్వదు. ఇంటికి పోయే వరకు ఏ టైమ్ అయితో తెల్వదు. బాయికాడ పశువులు ఎక్కడ పాయే.. ఇంటికాడ పెండ్లాం ఎక్కడ పాయే.. స్కూల్‌కు పోయిన పిల్లలు ఎక్కడ పోయిరి. రెండెకరాలు నాటినం.. 25 రోజులు అవుతుంది.. ఇప్పటి వరకు యూరియా వేయలేదు. రెండెకరాలు పండకపోతే ఉరి వెట్టుకుని చావాలి. అప్పుడే రైతు రాజు అయిపోతడు. నూటికి 99 శాతం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయ్యరు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య గవర్నమెంట్లో ఇదే పరిస్థితి.. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే పరిస్థితి’ అని రైతు పేర్కొన్నాడు.
99 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు
మనిషికి ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారు.. ఒక బస్తా ఒక ఎకరాకి కూడా రాదు
క్యూలైన్లో నిలబడి తోపులాట జరిగి కాలుకు దెబ్బ తగిలింది pic.twitter.com/c172710UqF
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025