Farmers | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ సర్కార్‌పై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నదాతలు చీల్చిచెండాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రైతులను నిలువునా మోసం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుండే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది రైతులు కేసీఆర్‌ను తలచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.
గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. యూరియా కోసం రైతులు వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా లేకపోవడంతో పోలీసు పహారా మధ్య అన్నదాతలకు యూరియాను పంపిణీ చేస్తున్నారు.
అయితే యూరియా కావాలంటూ ఆందోళనకు దిగిన అన్నదాతలను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. యూరియా అడిగిన తోటి రైతును అరెస్ట్ చేయబోతే మిగతా రైతులందరూ మూకుమ్మడిగా పోలీసులపై తిరగబడ్డారు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు అన్నదాతలు.
చివరకు అన్నదాతల ఆగ్రహానికి పోలీసులు గురికాక తప్పలేదు. రైతుల మూకుమ్మడి దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు యత్నించారు. ఎస్ఐకి కానిస్టేబుల్స్ ప్రొటెక్షన్గా నిలిచారు. ఒక్క యూరియా బస్తా కోసం అన్నం, నీళ్లు లేక తిరుగుతున్నాం.. అర్ధరాత్రి వచ్చి పడిగాపులు కాస్తున్నాం అని పోలీసులపై రైతులు మండిపడ్డారు.
తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది!
యూరియా అడిగిన తోటి రైతును అరెస్ట్ చేయబోతే పోలీసుల మీద మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు
సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో యూరియా అడిగిన రైతును అరెస్టు చేయబోయిన పోలీసులు
తోటి రైతుకు మద్దతుగా పోలీసులపై మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు pic.twitter.com/uBOziRbAf2
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025