Drinking water | కాసిపేట, మార్చి 17 : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట వన్ ఇంక్లైన్ గని కార్మికులు త్రాగు నీరు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా కాసిపేట 1వ గనిపై ఉన్న ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులు చేయించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. కార్మికులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అసలే ఎండాకాలం కావడం.. దాహం అధికంగా ఉండడంతో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ రిపేర్లో ఉండటంతో కాసిపేటలో ఉన్న ప్రైవేటు ఆర్వో ప్లాంట్ నుండి మంచి నీరు తెస్తుండగా.. కొన్ని డబ్బాలు తేవడంతో అవి కార్మికులందరికీ సరిపోక నీళ్లు అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఇటీవల కార్మికులు ఆందోళన చేస్తే వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు రిపేర్ చేయించలేదని.. దీంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎండాకాలం పరిస్థితి తీవ్రంగా ఉందని, నీళ్లు లేకుంటే కష్టంగా ఉందని, వెంటనే గనిపై ఆర్వో ప్లాంట్ కు మరమ్మత్తులు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
Peddapalli-Palakurthy | పెద్దపల్లిలో కల్వర్ట్ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి