KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. న్యూయార్క్లో కేటీఆర్కు ‘గ్రీన్ లీడర్షిప్’ అవార్డు వరించింది. సుస్థిర పాలనలో (sustainable governance) కేటీఆర్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
సెప్టెంబర్ 24న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో కేటీఆర్కు అవార్డు ప్రదానం చేయనున్నారు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ హైదరాబాద్లో హరితం(గ్రీనరీ) అభివృద్ధికి, చేసిన కృషికి ప్రశంసలు కురిపించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు, యూఎన్ గుర్తింపుతో ప్రపంచానికి హైదరాబాద్ ఆదర్శంగా నిలిచింది.