Farmer | హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓ అన్నదాత నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బజారుకీడ్చి బట్టలిప్పి కొట్టాలని ఆ రైతు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
అన్నదాత మాటల్లోనే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బజారుకీడ్చి బట్టలిప్పి కొట్టాలి. కేసీఆర్ పరిపాలనలో 24 గంటల కరెంట్ ఇస్తే.. కోమటిరెడ్డెమో ఇవ్వలేదు అన్నడు. ఇవాళ ఏది 24 గంటల కరెంట్. అర్ధరాత్రి 2.30 గంటలకు కరెంట్ ఇస్తున్నరు ఇప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు. వెనుక ముందు ఓ 4 గంటలు పోయినా.. 20 గంటలు మాత్రం కేసీఆర్ వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిండు. మంత్రులు ఎవరూ రాలేదు.. కనీసం మార్కెట్ చైర్మన్ కూడా రాలేదు. ఈ సొసైటీ చైర్మనే లేడు. సొసైటీ చైర్మన్ దొంగ. యూరియా బస్తాలు ఎక్కడివి అక్కడ పంపిస్తుండు ఫోన్లు చేసి అని రైతు మండిపడ్డారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బజారుకి ఈడ్చి.. బట్టలు ఇప్పి కొట్టాలి
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే ఇవ్వలేదని అన్నాడు.. ఇవాళ ఏది 24 గంటల కరెంటు?
సొసైటీ చైర్మన్ దొంగ.. యూరియా బస్తాలు ఎక్కడివి అక్కడ అమ్ముకుంటున్నాడు pic.twitter.com/FD0FXec0vH
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025