జోగులాంబ గద్వాల్ : జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మొత్తం 445.0 మిల్లీమీటర్ల వర్షపాతం ( Rainfall ) నమోదు కాగా సగటు వర్షపాతం 34.2 మిల్లి మీటర్లుగా ఉందని వాతావరణ శాఖ అధికారులు ( Meteorological department ) వెల్లడించారు. కాలూరు , తిమ్మనాదొడ్డిలో 70.5 మి.మీ , ధరూర్లో 4.8 మి.మీ
,గద్వాల్లో 1.7 మి.మీ, ఇటిక్యాల్లో 17.7 మి.మీ , మల్దకల్లో 21.7 మి.మీల వర్షం కురిసిందని వివరించారు. ఘట్టులో 87.5 మి.మీ,ఐజాలో 52.5 మి.మీ ,రజోలిలో 62.8 , వడ్డేపల్లెలో 46.9 , మనోపాడ్లో 32.1 , ఉండవెల్లిలో 14.2 , అలంపూర్లో 22.9 , ఎర్రవల్లిలో 9.7 మి.మీ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు.