న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.3.19 కోట్ల విలువైన 367 ఐఫోన్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సౌది అరేబియా రాజధాని రియాద్ నుంచి వచ్చిన ఫోన్లను గృహోపకరణాల పేరుతో ఎనిమిది కొరియర్ పార్సిల్స్ ద్వారా తరలిస్తుండగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐఐబీ), ఏసీసీ ఎక్స్పోర్ట్ కమిషనరేట్ స్వాధీనం చేసుకుంది. ఫోన్ల తరలింపుపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
SIIB, ACC Export Commissionerate,
— Delhi Customs (@Delhicustoms) June 3, 2021
seized 367 iPhones of various models having market value of Rs 3.19 Crore at New Courier Terminal. The phones were concealed in 8 courier parcels declared as household goods shipped from Riyadh.#IndianCustomsAtWork pic.twitter.com/9VHNQOqECv