పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
Groom fell on bride feet: ఓ పెండ్లి వేడుకలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా జరిగింది. వరుడే వధువు కాళ్లపైపడి దండం పెట్టాడు.

హైదరాబాద్: పెండ్లి వేడుకల్లో సాధారణంగా వధువు చేత వరుడి కాళ్లు మొక్కిస్తారు. తాళి కట్టినప్పుడు, అక్షింతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు, పూలదండలు మార్చుకున్నప్పుడు ఇలా చాలా సార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెండ్లి వేడుకలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా జరిగింది. వరుడే వధువు కాళ్లపైపడి దండం పెట్టాడు.
వివాహ తంతు పూర్తయ్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూతరు దండలు మార్చుకుంటున్న సమయంలో పెండ్లి కొడుకు అకస్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్లపై పడ్డాడు. ఈ అనూహ్య పరిణామానికి పెండ్లికి హాజరైన బంధు మిత్రులంతా ఆశ్యర్చపోయారు. ప్రస్తుతం వరుడు వధువు కాళ్లపైపడ్డ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తున్నది.
కాగా, తాను వధువు కాళ్లపై పడటానికి చాలా కారణాలున్నాయని వరుడు చెప్పాడు. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి నాకోసం, నా సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bride
- groom
- Marriage
- Trending news
RELATED ARTICLES
తాజా వార్తలు
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

