30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం | దేశంలో కొవిడ్ టీకాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్ : దేశంలో కొవిడ్ టీకాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కంపెనీకి 30 కోట్ల డోసుల ఆర్డర్ ఇవ్వగా.. రూ.1500 కోట్లు ముందస్తుగా చెల్లింపులు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బయోలాజికల్-ఈ టీకాలు తయారు చేసి, నిల్వ చేస్తుందని పేర్కొంది. బయోలాజికల్-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఒకటి, రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆర్బీడీ ప్రొటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్‌ను కంపెనీ తయారు చేసిందని, రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
కరోనా రెండో దశ దేశంలో భారీగా ప్రభావం చూపింది. దీంతో టీకాల పంపిణీ, ఎగుమతి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఈ మేరకు ముందస్తుగా ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లకు అనుమతి లభించగా.. పంపిణీ కొనసాగుతోంది. జూలై నాటికి రోజుకు కోటి మోతాదులను పంపిణీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు విదేశీ టీకా కంపెనీలైన ఫైజర్, మోడెర్నాతో సైతం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

