పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ | బిహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

పాట్నా : బిహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్ వేశారు. సుమారు వంద మందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 108 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, స్క్రీనింగ్ అనంతరమే వ్యాక్సిన్ వేస్తామన్నారు. ట్రయల్స్‌లో ఇంట్రామాస్కులర్ విధానంలో 0.5 ఎం.ఎల్ మోతాదు ఇచ్చామని, అనంతరం వారిని రెండు గంటలు పరిశీలినలో ఉంచినట్లు చెప్పారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని చెప్పారు.
రెండు నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహాయంతో అభివృద్ధి చేసింది. పిల్లలపై ట్రయల్స్ పాట్నా, ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరుగుతున్నాయి. వ్యాక్సిన్ హోల్ విరియన్ ఇనాక్టివేటెడ్ వెరో సెల్ డెరైవ్డ్ ప్లాట్ ఫామ్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ, కొవాగ్జిన్ టీకాలను దేశంలో 18 ఏళ్లుపైబడిన వ్యక్తులకు టీకా డ్రైవ్‌లో పంపిణీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

