North Carolina | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ మార్షల్స్ ప్రాణాలు కోల్పోయారు.
చార్లోట్ లోని గాల్ వే డ్రైవ్ వద్ద నివసిస్తున్న ఓ పాత నేరస్తుడికి అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు యుఎస్ మార్షల్స్ టాస్క్ ఫోర్స్ (US Marshals Task Force)లోని అధికారులు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. నిందితుడు కాల్పులు జరపడంతో రంగంలోకి దిగిన శ్వాట్ టీంలు ఎదురుకాల్పులు జరిపి ఓ నిందితుడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. మరో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు యూఎస్ మీడియా తెలిపింది.
Also Read..
Bomb Threat | భోపాల్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు
Patanjali | పతంజలికి మరో షాక్.. ఆ 14 ఉత్పత్తుల లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
Accident | రహదారులు రక్తసిక్తం.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం