Covishield | కొవిషీల్డ్‌తో రక్తం గడ్డకట్టే ముప్పు
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాక్సిన్-ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా ఆండ్ థ్రోంబోసిస్(వీఐటీటీ) అనే సమస్య ఉత్పన్నమయ్యే ముప్పు ఉందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
- ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
- ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదన్న ఏఎస్ఓహెచ్
Covishield | సిడ్నీ, మే 16: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాక్సిన్-ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా ఆండ్ థ్రోంబోసిస్(వీఐటీటీ) అనే సమస్య ఉత్పన్నమయ్యే ముప్పు ఉందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వీఐటీటీ బారిన పడ్డ వారిలో మెదడు, పొత్తికడుపు వంటి శరీరంలోని పలు చోట్ల రక్తం గడ్డ కట్టే ముప్పు ఉంటుంది.
ఈ అధ్యయనం వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైనా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తే ఈ యాంటీబాడీలు వెంటనే అప్రమత్తమై వైరస్ మీద దాడి చేసి అంతం చేస్తాయి. అయితే, కొన్నిసార్లు బయటి నుంచి వచ్చిన వైరస్ అనుకొని శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు, కణజలాలంపై కూడా కొన్ని ఆటోయాంటీబాడీలు దాడి చేస్తాయి.
ఇలా శరీరంలోని ప్లేట్లెట్ ఫాక్టర్ 4(పీఎఫ్4) అనే ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఒక హానికరమైన ఆటోయాంటీబాడీనే వీఐటీటీకి కారణమవుతున్నదని పరిశోధకులు గుర్తించారు. కాగా, వీఐటీటీ గురించి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన పని ఇప్పుడు లేదని నిపుణులు చెప్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ ప్రకారం.. వీఐటీటీ అనేది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల నుంచి 42 రోజుల మధ్య మాత్రమే ఉత్పన్నమవుతుంది. వీఐటీటీ సమస్య వచ్చిన వారిలో తీవ్ర తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, వెన్ను నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

