MI vs LSG | రోహిత్ దూకుడు.. పవర్ ప్లేలో ముంబై స్కోర్..?
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో వర్షం అంతరాయం కలిగించినా.. మంబై ఇండియన్స్ ఓపెనర్లు దంచతున్నారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(43), డెవాల్డ్ బ్రెవిస్(10)లు ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు.
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో వర్షం అంతరాయం కలిగించినా.. మంబై ఇండియన్స్ ఓపెనర్లు దంచతున్నారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(43), డెవాల్డ్ బ్రెవిస్(10)లు ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు. దాంతో, ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. ఆరు ఓవర్లకు ముంబై వికెట్ కోల్పోకుండా 57 రన్స్ కొట్టింది. ముంబై విజయానికి ఇంకా 84 బంతుల్లో 162 రన్స్ కావాలి.
లక్నో నిర్ధేశించిన భారీ ఛేదనను ముంబై ధాటిగా ఆరంభించింది. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన రోహిత్(43) దూకుడుగా ఆడాడు. మరో ఎండ్లో బ్రెవిస్(10) ఆచితూచి ఆడాడు. అయితే.. జట్టు స్కోర్ 33 వద్ద వాంఖడేలో వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. 10 50 గంటలకు ఓవర్ల కోత లేకుండా యథావిధిగా మ్యాచ్ ప్రారంభమైంది.
Ro𝙃𝙞𝙩𝙨 them out of the park 🚀
The Mumbai Indians opener creating the impact early on in the chase 👊
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvLSG | @mipaltan | @ImRo45 pic.twitter.com/J1VKzfzhft
— IndianPremierLeague (@IPL) May 17, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కొండంత స్కోర్ కొట్టింది. ముంబై ఇండియన్స్ కంచుకోటలో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(75), కెప్టెన్ కేఎల్ రాహుల్(55)లు విధ్వంసం సృష్టించారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా చెలరేగిన వీళ్లు నాలుగో వికెట్కు 109 రన్స్ జోడించి భారీ స్కోర్కు బాటలు వేశారు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(12 నాటౌట్), ఆయుశ్ బదొని(22 నాటౌట్) మెరుపులతో లక్నో జట్టు 6 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

