Supreme Court -ECI | పోలింగ్ ముగిసిన రెండు రోజుల్లో ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.. 24న సుప్రీం విచారణ
Supreme Court -ECI | పోలింగ్ ముగిసిన 48 గంటల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురించాలని దాఖలైన పిటిషన్‌పై వారంలోపు స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Supreme Court -ECI | పోలింగ్ ముగిసిన 48 గంటల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురించాలని దాఖలైన పిటిషన్‌పై వారంలోపు స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. వారంలోగా స్పందన తెలుపాలని ఈసీని ఆదేశించిన ధర్మాసనం.. దీనిపై ఈ నెల 24న విచారిస్తామని ప్రకటించింది.
ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పోలైన ఓట్ల సంఖ్యను విడివిగా ఫామ్ -17సీ పార్ట్ 1 స్కాన్డ్ ప్రతుల రూపంలో పొందు పరిచేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ గత నెల 19న ముగిసినా 11 రోజుల తర్వాత ఏప్రిల్ 30న ప్రచురించారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్ శాతాన్ని నాలుగు రోజుల తర్వాత అందుబాటులో ఉంచారు. అయితే, పోలింగ్ నాడు ఈసీ ప్రకటించిన ఓటింగ్ శాతం కంటే ఐదారు శాతం ఎక్కువగా ఏప్రిల్ 30న ప్రచురించిన గణాంకాల్లో కనిపించడంతో అనుమానాలు తలెత్తాయని ఏడీఆర్ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

