Everest | భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్‌కు (MDH spices) మరో షాక్ తగిలింది. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో వేటుకు గురైన ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ (Nepal) కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తాజాగా ప్రకటించారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ మాసాలాల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్లు నేపాల్ పేర్కొంది.
ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉన్నట్టు ఇటీవలే తేలిన విషయం తెలిసిందే. ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం.. తిరిగి వాటిని భారత్ పంపేయాలని ఆదేశించింది. ఎండీహెచ్ సాంబార్ మసాలాలో సైతం కేన్సర్ కారకాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో పలు దేశాలు ఈ రెండు ప్రాడక్ట్స్‌పై నిషేధం విధించాయి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. ఆస్ట్రేలియా మార్కెట్ నుంచి ఆయా కంపెనీల మసాలాలను రీకాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హాంకాంగ్ ఇటీవల మూడు ఎండీహెచ్ మసాలా దినుసులు, ఎవరెస్ట్ చేపల మసాలాల విక్రయాలను నిషేధించింది. ఇథిలిన్ ఆక్సైడ్ అధికంగా ఉన్నందున సింగపూర్ ఎవరెస్ట్ మసాలాను మార్కెట్ నుంచి రీకాల్ చేసింది.
కాగా, విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలు భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షిస్తున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, 2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఏమిటీ ఇథిలిన్ ఆక్సైడ్?
ఇథిలిన్ ఆక్సైడ్‌కు మండే స్వభావం ఉంటుంది. వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగుమందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి కూడా వాడుతారు. మోతాదుకు మించి ఇది శరీరంలోకి చేరితే రొమ్ము క్యాన్సర్‌తో పాటు నాడీమండల వ్యవస్థ, మెదడు, డీఎన్ఏపై దుష్ప్రభావం చూపే ప్రమాదమున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
Also Read..
Covishield | కొవిషీల్డ్‌తో రక్తం గడ్డకట్టే ముప్పు
Swati Maliwal | దాడి ఘటనలో స్వాతి మలివాల్ ముఖంపై అంతర్గత గాయాలు.. వైద్య పరీక్షల్లో వెల్లడి
Viral Video | స్టెప్లాడర్ను తొలగించిన సిబ్బంది.. విమానంపై నుంచి పడి గాయాలపాలైన వ్యక్తి