Swati Maliwal | కాలితో తన్నాడు… సున్నిత భాగాలపై కొట్టాడు.. దాడి ఘటనపై స్వాతి మలివాల్
దాడి ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ముఖంపై గాయాలు అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దాడి నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో దాదాపు మూడు గంటల పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు తేలింది (internal injuries on face).
మరోవైపు దాడి ఘటనపై స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అదేవిధంగా స్వాతి మలివాల్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. బిభవ్ కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించింది. కాలితో తన్ని, కర్నతో బాదినట్లు వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాకుండా కడుపుపై బలంగా కొట్టినట్లు పోలీసులకు వెల్లడించింది.
కాగా, ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటోగా తీసుకుంది. బిభవ్ కుమార్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దాడి వ్యవహారంపై మలివాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, తన పట్ల జరిగింది తీవ్రమైన తప్పిదమని ఆమె పేర్కొన్నారు. గడిచిన కొన్ని రోజులు తనకు చాలా కఠినమైనవని, తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని, వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు.
ఘటనపై నోరెత్తని కేజ్రీవాల్
మలివాల్‌పై దాడి ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. గురువారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వాతి మలివాల్ ఘటనపై మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు. అఖిలేశ్ యాదవ్ మైక్ తీసుకొని.. అడగడానికి ఇంకా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయని సూచించారు.
తర్వాత ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. మణిపూర్‌లో కార్గిల్ యుద్ధవీరుడి భార్యను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటికీ నోరెత్తడం లేదని, వేలాది మంది మహిళలపై లైంగికదాడికి పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటేందుకు బీజేపీ అనుమతించిందని ప్రత్యారోపణలు చేశారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేసినప్పుడు స్వాతి మలివాల్ అక్కడికి వెళ్తే ఆమెను పోలీసులు ఈడ్చేశారని, కొట్టారని గుర్తు చేశారు.
కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
మలివాల్‌పై దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనలో కేజ్రీవాలే ప్రధాన నేరస్థుడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా కేజ్రీవాల్ గూండా అని విమర్శించారు.
Also Read..
Indian Navy: 14 మంది శ్రీలంక జాలర్లను అరెస్టు చేసిన భారతీయ నేవీ
Baahubali Crown of Blood | గెట్ రెడీ మూవీ లవర్స్.. పాపులర్ ఓటీటీలో బాహుబలి నయా వెర్షన్
Billboard Collapse: ఆ ఓర్డింగ్ ఓనర్‌ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్.. అతనెలా చిక్కాడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

