Billboard Collapse: ఆ హోర్డింగ్ ఓనర్‌ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్.. అతనెలా చిక్కాడంటే?
Billboard Collapse: 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు రాష్ట్రాలకు తిరిగాడు. ముంబైలో కూలిన బిల్బోర్డ్ ఓనర్.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. చివరకు ఉదయ్‌పూర్‌లో అతను పట్టుబడ్డాడు. బిల్‌బోర్డు కూలిన ప్రమాదంలో 16 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ముంబైలో భారీ బిల్‌బోర్డు కూలిన(Billboard Collapse) ఘటనలో 16 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దుమ్ము తుఫాన్ రావడం వల్ల ఆ భారీ ఓర్డింగ్ ఓ పెట్రోల్ పంపుపై కూలింది. అయితే ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ భవేశ్ భిండే. అయితే అతను గత మూడు రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కానీ ఎట్టకేలకు ఉదయ్‌పూర్‌లో ఆ హోర్డింగ్ ఓనర్‌ను పట్టుకున్నారు. దీని కోసం వాళ్లు చాలా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు.
120 ఫీట్ల ఎత్తున్న బిల్‌బోర్డు కూలడం వల్ల 16 మంది మృతిచెందగా, మరో 75 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన రోజే ఆ హోర్డింగ్ ఓనర్ పరారీ అయ్యాడు. భవేశ్ గురించి ముంబై పోలీసులు అన్వేషించారు. ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఓ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక పోలీసులకు చెప్పకుండానే వాళ్లు భవేశ్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు.
తొలుత లోనావాలా వెళ్లాడు. అక్కడ నుంచి థానే. ఆ తర్వాత అహ్మాదాబాద్ వెళ్లాడు. మళ్లీ అక్కడ నుంచి అతను ఉదయ్‌పూర్ చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్లో అతను మరో పేరుతో దాక్కుకున్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలుసుకుని వెళ్లేలోగా.. అతను కొత్త సిటీకి పరారీ అయ్యేవాడు. భవేశ్‌ను పట్టుకునేందుకు ముంబై పోలీసులు 8 బృందాలుగా మారి అన్వేషించారు. క్రైం బ్రాంచ్ పోలీసులకు అతను చిక్కాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

