హైదరాబాద్ : మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు. కాల్పులు కొనసాగుతున్నాయని ఆపరేషన్ ఐజీ మైఖేల్ రాజ్ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Actor Teena Sravya | భక్తులకు క్షమాపణలు.. మేడారం ఘటనపై స్పందించిన నటి టీనా శ్రావ్య
Srinath Maganti | కార్తీక్ పాత్రలో మార్పు.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో శ్రీనాథ్ మాగంటి