దోహా : సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదికగా జరుగబోయే ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది అత్యుత్తమ షూటర్లు పతకాలకు గురిపెట్టనున్నారు.
పారిస్ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్‌తో పాటు హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్, సిఫ్ట్ కౌర్ సమ్ర, సామ్రాట్ రాణా, అర్జున్ బబుతా, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ వంటి ఆటగాళ్లు 8 విభాగాల్లో పోటీపడనున్నారు.