గాయాలతో కటకటాల్లో మెహుల్ ఛోక్సీ.. ఫొటోలు వైరల్
గాయాలతో కటకటాల్లో మెహుల్ ఛోక్సీ.. ఫొటోలు వైరల్ | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

రోజౌ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. డొమినికా జైలులో ఉన్న ఆయన ఫొటోలను ఆంటిగ్వా న్యూస్ రూమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో ఛోక్సీకి చేతికి, ఎడమ కంటికి గాయాలు, వాపు ఉండడం కనిపిస్తోంది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మెహుల్ ఛోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ కీలక నిందితులుగా ఉన్నారు. రూ.13,500 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉండగా.. మోసం వెలుగులోకి వచ్చే ముందే ఆయన ఆంటిగ్వా పౌరసత్వం తీసుకొని అక్కడికి పారిపోయారు.

నీరవ్ మోదీ లండన్‌కు పరారయ్యాడు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛోక్సీని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోగా.. ఈ నెల 25 కరేబియన్ దీపంలోని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది వేన్ మార్ష్ ఆరోపించారు. చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత ఛోక్సీతో వీడియో కాల్లో మాట్లాడేందుకు అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆయన్ని తీవ్రంగా కొట్టినట్లు అనిపిస్తుందని, కళ్లు ఉబ్బిపోయానని, ఒంటిపై కాలిన గాయాలున్నాయని తెలిపారు.

ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కొని ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని ఆయన నాతో చెప్పారని.. వారు భారత్, ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఛోక్సీ అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాదులు డొమినికాలో హేబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తూర్పు కరేబియన్ సుప్రీంకోర్టు శుక్రవారం ఛోక్సీకి తన న్యాయవాదిని కలవడానికి, వైద్య పరీక్షల కోసం అనుమతి ఇచ్చింది. అలాగే ఛోక్సీని భారత్‌కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది. ఈ విషయంలో తదుపరి విచారణ జూన్ 2న జరగనుంది.
PM says Choksi was funding Antigua’s main opposition, the UPP https://t.co/kFTb8u0R2d via @AntiguaNewsRoom
— allnewsreports (@allnewsreports) May 29, 2021
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు
జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్
దేశంలో కొత్తగా 1.65 లక్షల కరోనా కేసులు
రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

