జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్
జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్ | దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలన్నారు.

న్యూఢిల్లీ : దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలన్నారు. అలాగే వ్యూహాత్మకంగా విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు తెప్పించుకోవాలన్నారు. వ్యాక్సిన్ సేకరణకు ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చేందుకు ఔషధ కంపెనీలు నిరాకరించిన నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరిపేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు గులేరియా గుర్తుచేశారు. టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు. గర్భిణులకు సైతం టీకాలు వేయాలని సూచించారు. గర్భిణుల్లో అనారోగ్య సమస్యలతోపాటు మరణాల రేటు అధికంగా ఉందని, ఈ మేరకు వారికి త్వరగా వ్యాక్సిన్ వేయాలన్నారు. కొవాగ్జిన్ టీకా అయితే గర్భిణులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మల్టీ విటమిన్లు, జింక్ సప్లిమెంట్స్ వంటి రోగనిరోధక శక్తి బూస్టర్ల వాడకంపై స్పందిస్తూ.. అవి ఎలాంటి హాని చేయవన్నారు. కానీ, వాటిని ఎక్కువ కాలం తీసుకోకూడదని హెచ్చరించారు. బదులుగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, సహజ వనరుల నుంచి విటమిన్లు పొందాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

